హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇసుకపల్లి VRO మృతి

NLR: అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆయన మృతి పట్ల తోటి ఉద్యోగులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మల్లికార్జున ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.