హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాసుపుస్తకాల్లో తప్పిదాలు లేకుండా చూడాలి'

W.G: డిసెంబరులో రైతులకు పంపిణీ చేయనున్న పట్టాదారు పాసుపుస్తకాలను ఎలాంటి తప్పిదాలు లేకుండా, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి సిద్ధం చేయాలని ఇన్‌చార్జ్ జిల్లా కలెక్టర్ కె. ఆర్. కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. రీ సర్వే, పాసుపుస్తకాల తయారీ, పంపిణీపై ఆర్డీవోలు, తహసీల్దార్‌ల, సర్వేయర్‌లతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌ సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు.