హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యనమలమంద సర్పంచ్‌గా హరీశ్ ఏకగ్రీవం

CTR: వెదురుకుప్పం మండలం యనమలమంద గ్రామపంచాయతీ సర్పంచ్‌గా హరీశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎంపీడీవో పురుషోత్తం శుక్రవారం వెల్లడించారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో బరిలో ఉన్న అభ్యర్థులంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో హరీశ్ ఒక్కరి నామినేషన్ మాత్రమే మిగలడంతో ఏకగ్రీవ ఎన్నిక ఖరారైందని తెలిపారు.