హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల బూందీ పోటులో ఆయుధపూజ

TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదాలు తయారుచేసే బూందీ పోటులో శుక్రవారం ఉదయం ఆయుధపూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో భాస్కర్, పోటు ఏఈవో మునిరత్నం తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంట సామగ్రికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.