హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేములపూడి పంచాయతీ ఏకగ్రీవం

AKP: నర్సీపట్నం మండలం వేములపూడి పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. వేములపూడి గ్రామస్తులు మరొకసారి బోలెం కుటుంబ సభ్యులను ఆదరించారు. సర్పంచ్ పదవికి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా టీడీపీ బల్పరిచిన బోలెం గోపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే, 14 వార్డులు సైతం ఏకగ్రీవ ఎన్నికలు జరగడంతో పంచాయతీ మొత్తం ఏకగ్రీవం అయినట్లు అధికారులు ధ్రువీకరించారు.