హైదరాబాద్: 28°C
క్రైమ్

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

CTR: జిల్లాలోని శాంతిపురం మండల కేంద్రంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రాళ్లబూదుగురు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.