హైదరాబాద్: 28°C
క్రైమ్

చెట్టుపై కూలిన సెస్నా విమానం.. క్యాడెట్‌కు గాయాలు

TG: హైదరాబాద్ గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో క్యాడెట్, ఇన్‌స్ట్రక్టర్‌తో ప్రయాణిస్తున్న సెస్నా 152 విమానం ప్రమాదానికి గురైంది. అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తుండగా చెట్టుపై పడింది. ఈ ఘటనలో క్యాడెట్‌కు తలకు గాయాలై కుట్లు వేయగా, ఇన్‌స్ట్రక్టర్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.