హైదరాబాద్: 28°C
క్రైమ్

రాష్ట్రంలో పరువు హత్య కలకలం

TG: ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్య ఘటన కలకలం రేపింది. ఉమ్రిలో ఇతర కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కారణంతో కూతురు కళ్యాణిని తండ్రి కైలాష్ హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమెను ఉరివేసి చంపిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. తల్లి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.