హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగ దినోత్సవ చైతన్య యాత్రను ప్రారంభించిన ఎంపీ

ADB: 77వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన 'రాజ్యాంగ చైతన్య యాత్ర'ను ఎంపీ గోడం నగేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బేరా దేవన్నతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలు, హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని నాయకులు పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కాపాడాలని పేర్కొన్నారు.