హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

AP: అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువులో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.