హైదరాబాద్: 28°C
క్రైమ్

సైబర్ మోసగాళ్ల వల.. రూ.12.20 లక్షలకు టోకరా

TG: హైదరాబాద్‌లో ఘరానా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో సోఫా అమ్మకం పేరుతో నిందితులు మోసానికి పాల్పడ్డారు. మహిళకు సైబర్ నేరగాళ్లు రూ.12.20 లక్షలు టోకరా వేశారు. క్యూర్ కోడ్ స్కాన్ చేయాలంటూ విడతలవారీగా నగదు లూటీ చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.