హైదరాబాద్: 28°C
క్రైమ్

ఫుడ్ పాయిజన్.. విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత!

TG: ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని జోగిపేటలో ఘటన చోటుచేసుకుంది. భోజనం వికటించి పలువురు విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. విషయం బయటకు రాకుండా మిగిలిన ఆహారాన్ని పారబోసి, వంట పాత్రలను సిబ్బంది శుభ్రం చేశారు. అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.