హైదరాబాద్: 28°C
క్రైమ్

అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం

AP: విశాఖలో అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సత్యం జంక్షన్ నుంచి గురుద్వార్ వెళ్లే మార్గంలో అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న హోంమంత్రి అనిత ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు.