AP: విశాఖలో ఘరానా మోసం కేసును పోలీసులు ఛేదించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మహిళకు నమ్మకం కలిగించి ఆమె ఇంట్లోనే ఆశ్రయం పొందిన బెహరా మానస అలియాస్ ప్రీతి, అదును చూసి బంగారు, వజ్రాభరణాలు దొంగిలించి పరారైంది. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
క్రైమ్
ఇన్స్టా పరిచయంతో ఇంట్లో చోరీ.. మహిళ అరెస్ట్


