MLG: కన్నాయిగూడెం మండల పెరిక సంఘం (పురగిరి క్షత్రియ) నూతన కమిటీని నాయకులు మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సుమారు 60 మంది ప్రతినిధుల సమక్షంలో అధ్యక్షుడిగా చిట్టెం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మంచాల లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షుడిగా వనపర్తి రామయ్యను నియమించారు. ఉపాధ్యక్షులు, సలహాదారులతో సహా పూర్తి కమిటీని ఎన్నుకున్నారు.
వార్తలు
పెరిక సంఘం మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్


