హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు నెల్లిమర్లలో మెగా జాబ్‌మేళా

VZM: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు బుధవారం నెల్లిమర్లలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. BVR అకాడమీలో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో 12 కంపెనీలు పాల్గొని 200కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. పదో తరగతి నుంచి బీటెక్ వరకు విద్యార్హతలు కలిగిన పురుషులు, మహిళలు పాల్గొనవచ్చని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి చాముండేశ్వరరావు తెలిపారు.