హైదరాబాద్: 28°C
వార్తలు

మానవత్వం చాటుకున్న ఎస్సై

WGL: వర్ధన్నపేట పట్టణంలో ఇటీవల ఒంగూరి శ్రీకాంత్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోగా, ఆయనకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్ మానవత్వం చాటుకున్నారు. మంగళవారం అతడి భార్య కస్తూరి పేరుతో రూ.20 వేల నగదును పోస్ట్ ఆఫీస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. పిల్లల భవిష్యత్తుకు అండగా నిలిచిన ఎస్సైని స్థానికులు అభినందించారు.