హైదరాబాద్: 28°C
క్రైమ్

నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు

TG: ఆదిలాబాద్‌లో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు అయింది. చిల్ట్రన్ బ్యాంక్ నోట్లతో మోసాలకు పాల్పడ్డారు. డబ్బులు రెట్టింపు చేస్తామంటూ టోకరా వేశారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. రూ.40 లక్షలకు పైగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 100 నకిలీ బంగారు నాణేలు, 3 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు.