హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

NLR: లేబర్ కోడ్స్ రద్దు, కనీస వేతనం రూ.42 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1న నిర్వహించనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని CITU నేత పెంచల నరసయ్య కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లూరు రూరల్‌లోని YMC గ్రౌండ్ నుంచి RTC బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు విడనాడాలని డిమాండ్ చేశారు.