హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలి'

కోనసీమ: మండపేట పట్టణాన్ని సుందరంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పురపాలక సంఘ చైర్మన్ వేగుళ్ల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కార్యాలయం వద్ద పట్టణంలోని 36 వార్డులకు చెత్త సేకరణ, తరలింపు కోసం నూతన తోపుడు బళ్లను, ప్రతి వార్డుకు ఒక్కొక్కటి చొప్పున, అవసరమైన ప్లాస్టిక్ డ్రమ్ములతో ఆయన ప్రారంభించారు.