హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కాన్ చేస్తే చాలు.. ఫిర్యాదు చేయొచ్చు!

TPT: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు డీఈవో కేవీఎన్ కుమార్ తెలిపారు. ప్రతి కార్యాలయం, పాఠశాలలో క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓపీఎంఎస్ ద్వారా పోస్టర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రదర్శించాలని సూచించారు. ప్రజలు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను తెలియజేయవచ్చని పేర్కొన్నారు.