హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి'

సంగారెడ్డి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ మాట్లాడుతూ బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.