హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్ర విధానాలపై పోరుకు సిద్ధం: సీపీఐ

JN: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ జనగామ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్. రాజారెడ్డి పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్‌పూర్ సమావేశంలో మాట్లాడారు. కేంద్రం సంపన్నులకు మేలు చేస్తోందని, నిత్యావసర ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకించాలని, జైల్ భరో విజయవంతం చేయాలని కోరారు.