KMR: జిల్లాను గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 7 గంటలైనా మంచు వీడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు, ముందున్న మనుషులు సైతం కనిపించకపోవడంతో వాకింగ్‌కు వెళ్లేవారు, పాదచారులు అవస్థలు పడ్డారు. రహదారులపై దృశ్యమానత తగ్గడంతో వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించారు.
తెలంగాణ
VIDEO: కమ్మేసిన దట్టమైన పొగమంచు


