హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీగా హ్యాష్ఆయిల్ సీజ్.. ఐదుగురు అరెస్ట్

TG: హైదరాబాద్ పాతబస్తీ సంతోష్‌నగర్‌లో పోలీసులు డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఓ ఇంట్లో కిలో గంజాయి, 800 మి.లీ. హ్యాష్‌ఆయిల్‌ను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.