హైదరాబాద్: 28°C
వార్తలు

సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు

ASR: సైనిక్, నూతన సైనిక్ పాఠశాలల్లో 2027-28విద్యా సంవత్సరానికి 6, 9వ తరగతుల ప్రవేశాల కోసం దరఖాస్తులను డిసెంబర్ 2లోగా సమర్పించాలని అధికారులు తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)నిర్వహించే ఈ పరీక్ష జనవరి 31, 2027న జరుగుతుంది. ఆలస్య రుసుము రూ.500తో డిసెంబర్ 3నుంచి 6వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 7-9 తేదీల్లో వివరాల సవరణకు అవకాశం ఉంటుందన్నారు.