ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌ను సీపీ సునీల్ దత్ బుధవారం తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల దర్యాప్తు తీరును పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా కుటుంబ వివాదాలు, గృహహింస కేసుల్లో ఇరువర్గాల వాదనలు ఓపికగా విని, కౌన్సెలింగ్ ద్వారా సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
వార్తలు
మహిళా స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ


