హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కపిలేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన

TPT: శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం లక్ష బిల్వార్చన సేవ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, అభిషేకం, అలంకారం పూర్తి చేసిన అనంతరం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వేదపండితులు, అర్చకులు లక్ష బిల్వపత్రాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.