ASR: విశాఖపట్నం ఓల్డ్ ఐటీఐలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కన్వకేషన్లో అరకు ఐటీఐకి చెందిన కోపా ట్రేడ్ విద్యార్థిని కూరాడబోయి స్వాతిశ్రీ ఘనత సాధించింది. AITT Exams-2026లో 600కు 600 మార్కులు సాధించిన ఆమెను సర్టిఫికెట్, మెమెంటో, మెడల్తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపాళ్లు, కోపా మాస్టర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీఐ విద్యార్థిని రాష్ట్రస్థాయి ప్రతిభ


