హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

53 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి!

PLD: నవంబర్ 29న ఐదు మండలాల్లోని 53 గ్రామ పంచాయతీల్లో 540 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. ఇందు కోసం 534 పోలింగ్ కేంద్రాలు, 53 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 194 అత్యంత సమస్యాత్మక, 82 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు.