హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెండో విడత ఎన్నికలకు పటిష్ట భద్రత'

ప్రకాశం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ నెల 29న దర్శి, అద్దంకి నియోజకవర్గాల పరిధిలో 123 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 1,006 మంది పోలీసులతో భద్రత కల్పించనున్నారు. 2.61 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.