హైదరాబాద్: 28°C
క్రీడలు

సిరాజ్ 6 ఏళ్ల రికార్డుకు బ్రేక్..!

NZతో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్‌లోనూ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. 2020లో టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి సిరాజ్ ప్రతి విదేశీ టెస్ట్ సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడుతూ వచ్చాడు. అయితే, ప్రస్తుత సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో ఆరేళ్లుగా కొనసాగుతున్న అతడి రికార్డుకు తెరపడింది.