మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు భారత్, మలేసియా జట్లు సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. భోపాల్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో మలేసియాను భారత్ 4-1తో చిత్తు చేసింది. సెమీస్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భారత్ భావిస్తోంది. మరోవైపు చివరి లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై మలేసియా 4-0తో విజయం సాధించి మంచి జోష్‌లో ఉంది.
క్రీడలు
నేడు భారత్, మలేసియా హాకీ సెమీఫైనల్


