హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత వెటరన్ క్రికెటర్ వరల్డ్ రికార్డు

భారత వెటరన్ క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో చివరి వికెట్‌గా బరిలోకి దిగి 26 బంతుల్లోనే 40 పరుగులు చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ డ్యానీ బ్రిగ్స్‌ (35 పరుగులు) పేరిట ఉంది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తమిళనాడుపై సౌరాష్ట్ర తరఫున జయదేవ్‌ ఈ ఫీట్‌ సాధించాడు.