హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృథా అవుతున్నా NTR సాగర్ ప్రాజెక్ట్ నీరు

ASF: తిర్యాణి మండలంలోని NTR సాగర్ ప్రాజెక్ట్ పర్యవేక్షణ కొరవడటంతో నీరు వృథాగా లీకవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.ఎల్నినో నేపథ్యంలో నీటిని పొదుపు చేయాల్సి ఉండగా, సాగర్ నుంచి నీరు వృథాగా పోతుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గేట్ల వద్ద ఏర్పాటు చేసిన ఇనుప సీట్లను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడంతో గేట్లకు తుప్పు పట్టి పనిచేయని స్థితికి చేరుకున్నాయి.