హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇసుక అక్రమ రవాణా..11 ట్రాక్టర్లు పట్టివేత

HNK: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఐనవోలు మండలం పంథిని వద్ద వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ట్రాక్టర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వాటిని ఐనవోలు పోలీస్ స్టేషన్‌కు తరలించి యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.