హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి

ASF: ఈనెల 28న మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెండుగూరే శ్యాంరావు పిలుపునిచ్చారు. సిర్పూర్ నియోజకవర్గంలో శుక్రవారం మాలి సంఘం నాయకులతో ఆయన మాట్లాడుతూ.. పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని, ఆయన ఆశయాలను యువతకు వివరించాలని కోరారు.