హైదరాబాద్: 28°C
క్రీడలు

అదరగొడుతున్న భారత బౌలర్లు

NZతో రెండో టెస్టులో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. లంచ్‌కు ముందు ఒక వికెట్ తీయగా బ్రేక్ తర్వాత 3 వికెట్లు పడగొట్టారు. 42, 43, 44 ఓవర్లలో ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుతం కివీస్ స్కోర్ 119/4గా ఉంది. ఆకాశ్ దీప్ 2, గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. లాథమ్ (59), కాన్వే (31), నికోల్స్ (16), రచిన్ రవీంద్ర (0) ఔటయ్యారు. మిచెల్, బ్లండెల్ క్రీజులో ఉన్నారు.