హైదరాబాద్: 28°C
వార్తలు

భార్య మృతికి కారణమైన భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష

KNR: వీణవంక మండలం రెడ్డిపల్లిలో భార్య స్వరూపపై దాడి చేసి ఆమె మృతికి కారణమైన భర్త చింతల మహేందర్ రెడ్డికి న్యాయస్థానం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.4 వేల జరిమానా విధించింది. 2023లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు పక్కా సాక్ష్యాధారాలు సమర్పించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి జమ్మికుంట రూరల్ సీఐ కిశోర్, పీపీ ప్రతాప్‌ను సీపీ అభినందించారు.