హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌లో పర్యటించనున్న ఐర్లాండ్ క్రికెట్ టీమ్

వచ్చే ఏడాది జనవరిలో 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు ఐర్లాండ్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. JAN 20 నుంచి 24 వరకు పాకిస్థాన్‌ జాతీయ జట్టుతో ఐర్లాండ్‌ 3 వన్డేల సిరీస్‌ ఆడనుంది. అంతకుముందు JAN 13 - 17 వరకు పాకిస్థాన్‌ షహీన్స్‌ (పాక్‌-A)తో మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతాయి.