హైదరాబాద్: 28°C
వార్తలు

ఇకపై ప్రతి ఫ్లాట్‌కూ ప్రత్యేక ఆస్తి కార్డు!

అపార్ట్‌మెంట్లలోని ప్రతి ఫ్లాట్‌కు ప్రత్యేక ఆస్తి కార్డు జారీ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. యజమాని పేరు, ఫ్లాట్ విస్తీర్ణం, హక్కులు, రుణాలు, తనఖాలు, పన్ను బకాయిలు, కోర్టు ఆంక్షల వివరాలను ఇందులో నమోదు చేయనున్నారు. ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాల్లో పారదర్శకత పెంచడంతోపాటు మోసాలు, యాజమాన్య వివాదాలను అరికట్టడమే ఈ కార్డు లక్ష్యమని మహా రెవెన్యూ మంత్రి తెలిపారు.