AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో జరగనున్న భేటీలో కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది. ఏపీకి పెట్టుబడుల ద్వారా వచ్చిన రూ.88,392 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేయనుంది. ఉద్యోగాల కల్పన, హైపర్‌స్కేల్ డేటా సెంటర్, అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ వంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
వార్తలు
ఇవాళ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ


