హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

AP: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.