హైదరాబాద్: 28°C
వార్తలు

ఇదే జోరు కొనసాగించాలి: మంత్రి లోకేష్

AP: తొలి విడత పంచాయతీ ఎన్నికల విజయంతో సంతృప్తి చెందొద్దని.. మిగిలిన రెండు దశల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని మంత్రి లోకేష్ అన్నారు. గెలుపుపై ధీమాతో నిర్లక్ష్యం వద్దని, ప్రతి ఎన్నికనూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. జనసేన, బీజేపీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. వరుస ఓటములతో వైసీపీ ఫ్రస్ట్రేషన్‌లో ఉందని, ఆ పార్టీ నేతలు హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు.