హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర రెడ్డి సమక్షంలో కడిమెట్ల పంచాయతీ పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.