హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సౌత్ జోన్ జట్లకు ఆదిత్య విద్యార్థుల ఎంపిక

అన్నమయ్య: మదనపల్లె ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జేఎన్‌టీయూఏ సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయ పురుషుల హాకీ, చెస్ జట్లకు ఎంపికయ్యారు. హాకీకి తరుణ్ రెడ్డి, హిమేష్ రెడ్డి, చెస్‌కు ప్రశాంత్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.