తిరుప్పరంకుండ్రం జ్యోతి వివాదంపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మండిపడ్డారు. దీపాన్ని వెలిగించడం ఆపడం ద్వారా తమిళ ప్రజల అభివృద్ధిని, తమిళనాడు గౌరవాన్ని ఆపలేరన్నారు. ఇవాళ దీపాన్ని వెలిగించేందుకు అడ్డుచెప్తున్న వారు.. రాబోయే రోజుల్లో హిందువులు ఆలయానికి వెళ్లొద్దంటారని మండిపడ్డారు. మతాన్ని ఆచరించే హక్కును అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారని, కాంగ్రెస్ దాన్ని నమ్ముతుందా అని ప్రశ్నించారు.
వార్తలు
‘ఇప్పుడు దీపం.. రేపు ఆలయానికి వెళ్లొద్దంటారు’


