తమిళనాడు సీఎం విజయ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ విజయ్ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో విజయ్ తన ఆదాయ, భూ యాజమాన్య వివరాలను కచ్చితంగా వివరించలేదని పిటిషనర్ తెలిపారు. ఈ ఆరోపణలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.
వార్తలు
సీఎం విజయ్‌కు హైకోర్టు షాక్


