హైదరాబాద్: 28°C
వ్యాపారం

వాట్సాప్‌ నుంచి మరో కొత్త ఫీచర్‌

వాట్సాప్‌ నుంచి మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. విదేశీ ప్రయాణికుల కోసం త్వరలో డేటా ఈ-సిమ్ తీసుకువస్తున్నట్లు మెటా ప్రకటించింది. దీని వల్ల ఇతర దేశాలకు ప్రయాణించేవారు ఫోన్లలో తమ పాత సిమ్‌ కార్డు మార్చకుండానే డేటా ఈ- సిమ్‌లు కొనుగోలు చేసి వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది. ఇందుకోసం జియో, ఇతర టెలికాం సంస్థలతో జట్టు కట్టనున్నట్లు వెల్లడించింది.