హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం కుర్చీపై వివాదం.. యోగికి సంజయ్ మద్దతు

యూపీలో సీఎం అభ్యర్థిపై వివాదం నెలకొన్న వేళ సీఎం యోగికి శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ మద్దతు పలికారు. సీఎం అభ్యర్థిగా యోగినే ఎంతో సమర్థుడని కొనియాడారు. యోగి అంటే తనకు ఎంతో ఇష్టమని.. హిందుత్వంలో ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. యోగి ఉంటేనే యూపీ.. ఆయన లేకపోతే యూపీ లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధిస్తుందని యోగి మాటల్లో కనిపిస్తోందన్నారు.